సీఎం కేసీఆర్ గొప్ప వ్యక్తి…ఎవరికీ ఆపద రానివ్వరని కొనియాడారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గు ర్తూ రు అమ్మా పురం గ్రామాల్లో ఉన్న వలస కార్మికులకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ నుంచి ఇక్కడి క్వారీలలో పని చేయడానికి వచ్చిన కూలీలు..కరోనా ఎఫెక్ట్ తో క్వారీల లో కూడా పనులు సాగడం లేదన్నారు. కూలీలను ఆదుకోవాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారని..సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు వలస కూలీలకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేశామని తెలిపారు.
కరోనా కు వలస కూలీలు భయ పడాల్సిన పని లేదని…అందరిని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్పారు. పనులు ప్రారంభం అయ్యే దాకా మీకు 12 కిలోల ఉచిత బియ్యం, రూ.500 అందజేస్తాం అన్నారు.
దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులందరి జీతాలు కోసి అయినా సరే, ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూస్తున్నారని తెలిపారు. కరోనా పోయే దాకా ప్రజలంతా సంయమనంతో ప్రభుత్వానికి సహకరించాలన్నారు.