వలస కూలీల ఆకలి తీర్చడం తమ బాధ్యతః మంత్రి హ‌రీశ్ రావు

246
harish rao
- Advertisement -

వలస కూలీల ఆకలి తీర్చ‌డం తమ బాధ్యత అన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం మొదటి విడతలో జిల్లా కేంద్రమైన సిద్ధిపేట- మందపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన డీఎక్స్ఎన్ పరిశ్రమ వద్ద ఉన్న క్యాంపులో 360 మంది, అలాగే నర్సాపూర్ డబుల్ బెడ్ రూమ్ వద్ద క్యాంపులో 320 మంది, అదే విధంగా గజ్వేల్ పట్టణ శివారు ముట్రాజ్ పల్లి క్యాంపులో 680 మందికి, మర్కుక్ లోని క్యాంపులో 300 మందికి, తునికి-బొల్లారం క్యాంపులో 600 మందికి మొదటి విడతగా ఏర్పాటు చేసిన క్యాంపులో ఆయన స్వయంగా వెళ్లి వలస కూలీలకు 12 కిలోల బియ్యం, రూ.500 రూపాయల నగదును మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

ఈసంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్ రావు మాట్లాడుతూ…వ‌ల‌స కూలీల‌ను మా కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని సీఏం కేసీఆర్ మ‌మ్మ‌ల్ని మీ దగ్గరకు పంపారని తెలిపారు. జిల్లాలో వలస కూలీలు ఉన్నచోటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా చూడటం కోసం మంచినీరు, వసతి, భోజనం, వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించామ‌న్నారు. రేషన్ కార్డు లేకపోయినా ఒక్కో వలస కూలీకి రూ.500 ఇస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆకలితో ఉండొదన్నదే సీఏం కేసీఆర్ ప్రధాన ధ్యేయమ‌ని చెప్పారు. కరోనా వైరస్ గురించి మీరంతా భయపడాల్సిన అవసరం లేదు. కరోనా నుంచి ముందు జాగ్రత్త తీసుకోవాలి. మీకు ఏదైనా జ్వరం, దగ్గు వస్తే మా దృష్టికి తీసుకువస్తే మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్యం అందిస్తాం. మీరు చెప్పకపోతే మీకే నష్టం వాటిల్లుతుందన్నారు. మీరంతా ఒక్క పని చేయాలని, మీరంతా ఓకే చోట గుమి గూడవద్దని, సామాజిక దూరం పాటించాలని, ప్రతి రెండు గంటలకు ఒక్కసారి చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని అవగాహన కల్పించారు. పనికి వెళ్లినప్పుడు దూరం దూరంగా ఉండి పని చేయాలని సూచిస్తూ.. ప్రతిరోజూ పొద్దున్న, సాయంత్రం స్నానం చేసి, ఎప్పటికప్పుడు మీరు ఉండే చోటును పరిశుభ్రంగా నిలపాలని కోరారు.

harish rao

- Advertisement -