త్వరలో 57 సంవత్సరాలకే ఆసరా పెన్షన్ అందజేస్తామని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఖైరతాబాద్‌లో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన సమస్యలు, సలహాలు , పిర్యాదుల కోసం వెబ్ సైట్,కాల్ సెంటర్ ను ప్రారంభించారు ఎర్రబెల్లి దయాకరరావు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పెన్షన్ దారులకు ఆసరా లబ్ధిదారులకు 864 కోట్లు ప్రతి నెల ఖర్చు పెడుతున్నామని చెప్పారు.
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ సీఎం అయ్యాక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. లబ్ధిదారులకు సరైన సమయంలో పెన్షన్ అందుతా లేదు అని ఆరోపణలు వస్తున్నాయి … అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఈ కాల్ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. జిల్లాకు ఒక్క టోల్ ఫ్రీ నంబర్ ఉంటుందని..వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదులు, సలహాలు చేయవచ్చన్నారు.
ఎలాంటి ఇబ్బందులు ఉన్న ఈ కాల్ సెంటర్ ను ప్రారంభించాం.. రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో ఇది అందుబాటులో కి వస్తుందన్నారు. ఈ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేస్తే తక్షణమే ఫిర్యాదులను స్వీకరించి పరిస్కారం చేస్తారని చెప్పారు. ఇప్పటివరకు 26 రకాల ఫిర్యాదులు వచ్చాయి…రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్కిం ఇదన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్,సెర్ప్ సీఈవో పౌసుమి బసు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.