భారీగా తగ్గిన పెట్రోల్-డీజిల్ ధరలు..

511
petrol price
- Advertisement -

గత కొంతకాలంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఒకానొక దశలో లీటర్ పెట్రోల్ ధర 79 రూపాయలు దాటి.. వాహనదారులను హడలెత్తించింది. సెప్టెంబర్‌, ఆగష్టు నెలలో పెట్రోల్ ధరలు బగ్గుమన్నాయి. ‘అరాంకో’ చమురు కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడితో అంతర్జాతీయంగా మార్కెట్‌ను కుదిపేసింది.

దీంతో ఇంధన ధరలు భారీగా పెరుగుతాయని వాహనదారులు బెంబేలెత్తిపోయారు. కానీ పెట్రోల్, డీజిల్ ఈ నెల ఆరంభం నుంచి ఇప్పటి దాకా చూస్తే భారీగానే తగ్గాయి. పెట్రోల్ ధర ఏకంగా రూ.1.28 పడిపోయింది. డీజిల్ ధర కూడా రూ.1.04 క్షీణించింది. 13 రోజుల్లో పెట్రోల్ ధర 9 సార్లు పడిపోయింది. డీజిల్ ధర 8 రోజులు తగ్గుతూనే వచ్చింది.

ఒక రకంగా.. రెండు నెలల నుంచి పెట్రోల్ ధరలు గమనిస్తే.. దాదాపుగా ఇప్పుడు రెండు రూపాయలకు పైగానే ధర తగ్గిందని చెప్పవచ్చు. అక్టోబర్ నెల 1 నుంచి పెట్రోల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని పలు మెట్రో నగరాల్లో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..

petrol

-హైదరాబాద్‌‌ లీటర్ పెట్రోల్ ధర రూ.77.21గా ఉంది. డీజిల్ లీటర్ ధర 72 రూపాయలుగా ఉంది.
-ఢిల్లీలో లీటర్ పెట్రోలు రూ.73.32 కాగా.. డీజిల్ రూ. 66.46గా ఉంది.
-ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.78.93 కాగా.. డీజిల్ రూ.69.66గా ఉంది.
-చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.14 కాగా.. డీజిల్ రూ.70.20గా ఉంది.
-అమరావతిలో పెట్రోల్ లీటర్‌ ధర రూ.77.58 కాగా.. డీజిల్‌ ధర రూ.71.75 గా ఉంది.
-విజయవాడలో లీటర్‌ పెట్రోల్ ధర రూ.77.21 కాగా.. డీజిల్ ధర రూ.71.41 గా కొనసాగుతోంది.

- Advertisement -