పేదరిక నిర్మూలనకే సెర్ప్:మంత్రి ఎర్రబెల్లి

87
minister errabelli

నర్సంపేట నియోజకవర్గం చెన్నారావు పేటలో రైతు ఉపకరణాల అద్దె కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)ఆధ్వర్యంలో 64 లక్షల రూపాయలతో మహిళా రైతులకి వ్యవసాయ సంబంధ పరికరాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
అందచేశారు.

ఈ సంద్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తన మొదటి రైతు ఉపకరణాల అద్దె కేంద్రాన్ని చెన్నారావు పేటలో ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పరికరాలను మహిళ రైతులు సద్వినియోగం చేసుకొని రైతులు తమ సొంత కాళ్లపై నిలబడి అభివృద్ధి చేందాలన్నదే కేసీఆర్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ అధునాతన పరికరాలను తమ సొంత వ్యవసాయ అవసరాలకు వినియోగించుకుంటూ, అద్దె ఇవ్వటం ద్వారా ఉపాధి కల్పన జరుగుతుంది అని మంత్రి దయాకర్ రావు గారు అన్నారు.

ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితం అయిన మహిళామణులు నేడు కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా ఎంతగానో అభివృద్ధి చెందుతూ సమాజంలో మంచి గుర్తింపు గౌరవాన్ని పొందుతున్నారు అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ హరిత, సెర్ప్ అధికారులు, లబ్ధిదారులైన మహిళలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కి మహిళలు కోలాటాలు, నృత్యాలతో తిలకం దిద్ది ఘనంగా స్వాగతం పలికారు. అలాగే మంత్రి వ్యవసాయ పరికరాలను పరిశీలించారు.