మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి: మంత్రి ఎర్రబెల్లి

476
errabelli dayakarrao
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే ప్రతిపక్షాలు వంద రకాలుగా అడ్డుపుల్లలు వేసినా మూడేళ్లలో పూర్తిచేశామని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఖమ్మం జిల్లాలో కల్లూరులో మాట్లాడిన ఆయన గత ప్రభుత్వాలకు కేసీఆర్ ప్రభుత్వాలకు తేడాను ప్రజలు గమనించాలన్నారు.

తెలంగాణ వస్తే కరెంటే ఉండదని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎద్దేవా చేశారు కానీ తొలినాళ్లలోనే దానిని అధిగమించామని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా నెల రోజుల్లో ఇంటికి నీళ్లు ఇస్తామని గ్రామాలను బాగు చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అన్నారు.

గ్రామాలు ఆదాయం పెంచుకోవాలని…వైకుంఠధామం కూడా ఓ దేవాలయం మాదిరి ఉండాలన్నారు. తడి, పొడి చెత్త వేరు చెయ్యడం ఇంటి నుంచే జరగాలని..అపరిశుభ్రత విషయంలో గ్రామాల్లో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

కావాలని ఉప సర్పంచ్ లు, సంతకం చెయ్యకుండా ఉంటే వారం రోజులలో వారి చెక్ పవర్ రద్దు చేస్తం అన్నారు. 12 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేస్తున్నాం ..దేశంలో అత్యధికంగా ధాన్యం కోనుగోలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు.

- Advertisement -