Errabelli:తప్పుడు వార్తలు రాయకండి

14
- Advertisement -

నా మీదా చరణ్ చౌదరి ఆరోపణలు చేశారు, పిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి..చరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదు అన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి…అతను బిజెపిలో ఉండి భూ కబ్జాలు చేస్తున్నాడని పార్టీ నుండీ సస్పెండ్ చేసిందన్నారు. NRI వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసాలు చేసేవాడని…విజయ్ అనే వ్యక్తీని అంతే మోసం చేశాడన్నారు.

NRI వాళ్లు అందరు నాకు పరిచయస్తులు….చరణ్ పై చాలా కేసులు ఉన్నాయన్నారు.దొంగ పత్రాలు పెట్టీ కబ్జాలు చేయటం, అనేక కేసులు అతని పై ఉన్నాయని…40 యేండ్ల పాటు రాజకీయాల్లో ఉంటున్న, నా పై ఎటువంటి మచ్చ లేదన్నారు. వాస్తవాలు తెలుసుకొని ప్రెస్ మిత్రులు వార్తలు రాయాలని…విజయ్ అనే వ్యక్తీ మా బంధువని వార్తలు రాస్తున్నారు, విజయ్ మాకు బంధువు కాదు అన్నారు.

ప్రణిత్ రావు ఎవరో నాకు తెలియదు…మా ఫ్రెండ్స్ పై పార్టీ మారమని ఒత్తిడి తెస్తున్నారు…ఎంత ఒత్తిడి తెచ్చిన నేను పార్టీ మారేది లేదు అని తేల్చిచెప్పారు.రాజశేఖర్ రెడ్డి హయంలో పార్టీ మారమని ఎంతో ఒత్తిడీ, కేసులు పెట్టారు…కావాలని వర్ధన్నపేట నియోజకవర్గాని ఎస్పీ రిజర్వర్డ్ చేశారన్నారు. ఓటు నోటుకు కేసు … నాకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Also Read:గేమ్ ఛేంజర్..చరణ్ బర్త్ డే పోస్టర్

- Advertisement -