జగపతిబాబుకు మంత్రి ఎర్రబెల్లి బర్త్ డే విషెస్

61
jagapathi babu
- Advertisement -

సినీ నటుడు జగపతిబాబు పుట్టిన రోజు సందర్భంగా హైదారాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…. జగపతి బాబు హీరో గా, విలన్ గా, తన గొప్ప నటనతో సినీ ప్రేక్షకులతో అనుబంధాన్ని, అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రత్యేకించి మహిళలు జగపతిబాబును బాగా అభిమానిస్తారు. ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి. సుదీర్ఘంగా సినిమాల్లో నటిస్తూ మరింత గొప్ప పేరు తెచ్చుకోవాలి. ఆయనకు అనేక మరిన్ని అవార్డులు, రివార్డులు రావాలి. అని ఆకాంక్షిస్తున్నాను. తన చిరకాల మిత్రునికి మరోమారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని అన్నారు.

- Advertisement -