క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

666
errabelli
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు మందం సమీపంలో బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నిన్న 8 మృతదేహాలను వెలికి తీసిని రెస్య్యూ సిబ్బంది ఇవాళ మరో నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. దీంతో ఆచూకీ లభ్యమైన మృతదేహాల సంఖ్య 12కి చేరింది. మిగితా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతోంది.

మరోవైపు ప్రమాదఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్..మంత్రులు పువ్వాడ నాగేశ్వరావు, ఎర్రబెల్లి దయాకర్ రావులను ఘటన స్థలికి పంపించి వివరాలు తెలుసుకుంటున్నారు.

రాజమండ్రి లో క్షతగాత్రులను పరామర్శించారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే అరురి రమేష్. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి ఎర్రబెల్లి వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామని చెప్పారు.

errabelli errabelli errabelli

- Advertisement -