భద్రకాళి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ఎర్ర‌బెల్లి దంప‌తులు..

304
minister errabelli dayakar
- Advertisement -

వరంగల్ భద్రకాళి ఆలయంలో శ‌ర‌న్న‌వ‌రాత్రి, శాకంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు-ఉషా దయాకర్ రావు దంపతులు. ఆలయ అర్చకులు, ఈఓ మంత్రి ఎర్రబెల్లి దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎర్ర‌బెల్లి దంప‌తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.ద‌ర్శ‌నానంత‌రం మంత్రికి ఆశీర్వ‌చ‌నం ఇచ్చి, అమ్మ‌వారి వ‌స్త్రాలు బ‌హూక‌రించారు భ‌ద్ర‌కాళి దేవాల‌య అర్చ‌కులు. ఆల‌య అభివృద్ధి, స్థితిగ‌తులు త‌దిత‌ర అంశాల‌పై ఇఓ తో మంత్రి చ‌ర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ: అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంది. సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉండాల‌ని కోరుకున్నాను అని మంత్రి తెలపారు. కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా వుండాలని ఆకాంక్షించాను. అతి పురాత‌న‌, కాక‌తీయుల నాటి, ఎంతో పాటి ఉన్న ఆల‌యం భ‌ద్ర‌కాళి దేవాల‌యం. తెలంగాణ వ‌చ్చాకే, భద్రకాళి ఆలయం అభివృద్ధి చెందుతున్న‌ది. ట్యాంకు బండ్ నిర్మాణం జ‌రిగింది. ఆల‌య అభివృద్ధికి మ‌రింత కృషి జ‌రుగుతున్న‌దని మంత్రి అన్నారు.

మొత్తం వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని హైద‌ర‌బాద్ త‌ర‌హాలో, అభివృద్ధి ప‌రిచేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది. కుడా ప‌రిధిలోనూ అద్భుత అభివృద్ధికి ప్ర‌ణాళిక సిద్ధ‌మైంది. సిఎం కెసిఆర్ తెలంగాణ‌ని, దైవికంగా, సాంస్కృతిక ప‌రంగా కూడా అభివృద్ధి ప‌రుస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు.

- Advertisement -