మంకీ ఫుడ్‌ కోర్టులతో కోతుల బెడదకు చెక్‌..

213
errabelli
- Advertisement -

6వ విడత తెలంగాణ కు హరితహారం లో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండ‌లం మడిపల్లి గ్రామంలోని కపిల్ హోమ్స్ లో మొక్క‌లు నాటారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. తొర్రూరు పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ఎదురుగా కేజీవీబీ స్కూల్లో మొక్కలు నాటిన ఎర్రబెల్లి….పీపీఈ కిట్లను పంపిణీ చేశారు.

తెలంగాణ తరహాలో మొక్కలు నాటే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదన్నారు మంత్రి ఎర్రబెల్లి.మొక్కలు జీవావరణాన్ని పెంపొందిస్తాయి…ప్రజలంతా మొక్కలు నాటాలి. వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలి..అధికారులు లక్ష్యలకానుగునంగా పని చేయాలన్నారు.

నిర్లక్ష్యం వహించే అధికారులు, ప్రజాప్రతినిధులు మీద చర్యలు తప్పవని…మంకి ఫుడ్ కోర్టులతో కోతుల బాధ తీరుతుంది…వైకుంఠ ధామాలు, స్కూల్స్, డంప్ యార్డులకు మొక్కల ఫెన్సింగ్ పెట్టాలన్నారు.

కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…ప్రజలు స్వీయ నియంత్రణతో ఉండాలన్నారు. కరోనా వైరస్ ని అరికట్టడం, చికిత్స చేయడంలో డాక్టర్ల పాత్ర కీలకం అన్నారు. డాక్టర్లు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మన ప్రాణాలు కాపాడుతున్నారని చెప్పారు. డాక్టర్లకు ppe కిట్లు పంపిణీ చేయడం అత్యవసరం అన్నారు.

- Advertisement -