గల్లీ కావాలో, ఢిల్లీ కావాలో ప్రజలు తేల్చుకోవాలి- ఎర్రబెల్లి

138
errabelli
- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా మీర్ పేట హౌసింగ్ బోర్డు డివిజన్ ముఖ్య కార్యకర్తలు, నాయకులు, బూత్ ఇంచార్జీ లతో భారత్ ఫంక్షన్ హాల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశమైయ్యారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి.గల్లీ కావాలో, ఢిల్లీ కావాలో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అమ్మక్కు అన్నం పెట్టని బాపతు వాళ్ళు, ఇక్కడ చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తరంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు. ప్రజావసరాల మన టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తీరుతాయి. ఇప్పటికే 67వేల కోట్లతో అభివృద్ధి జరుగుతున్నది. వరద సాయం ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వం అందజేస్తుంది ఆందోళన వద్దని మంత్రి స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరంలో 109 చోట్ల డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నం. ఇప్పటి కే కొన్ని ఇండ్ల ప్రవేశం జరిగింది. మిగతా ఇండ్ల ప్రవేశం ఎన్నికల తర్వాత ఉంటుందన్నారు. స్థానిక సంస్థల మీద పూర్తి అవగాహనతో ఉన్నాను. సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ ల సహకారంతో మీ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత నాది. ఇప్పుడు పని చేసి, గెలిపించిన వాళ్లకు తగిన గౌరవం ఉంటుంది. వాళ్లందరినీ గుర్తు పెట్టుకొని, పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా గౌరవిస్తామన్నారు.

కాలనీలు, బూత్ ల వారీగా ఇంచార్జీ లతో ప్రత్యేకంగా సమావేశం అయిన మంత్రి..వాళ్ళందరి తోను, బూత్ ల వారి కార్యాచరణ ను వివరించారు. ఈ 10 రోజులపాటు పార్టీ శ్రేణులు ప్రణాళికా బద్ధంగా, పకడ్బందీగా పని చేయాలని చెప్పారు. కమిటీల వారీగా పనులు జరిగి పోవాలని, ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవాలని మంత్రి సూచించారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ప్రజలతో సమన్వయం చేసుకోవాలి. యూత్, మహిళలను ప్రత్యేకంగా గౌరవిద్దాం.. ఇక నుండి ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చెద్దామన్నారు. ప్రభుత్వ పథకాలు రాని కుటుంబం లేదు. ప్రజలంతా మనకు అండగా ఉన్నారన్నారు.

ఇప్పటికే జరిగిన 100 కోట్ల అభివృద్ధికి మరో 100 కోట్ల అదనంగా తెస్తాను. మీర్ పేట హౌసింగ్ బోర్డు అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను. మనమంతా కలిసి కట్టుగా మరింత అభివృద్ధిని చేసుకుందాం..కాగా, సిట్టింగ్ కార్పొరేటర్ గోల్లురి అంజయ్య, పార్టీ, మంత్రి ఆదేశాల మేరకు తన నామినేషన్ ని ఉపసంహరించుకున్నారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి ప్రభుదాస్ విజయం కోసం పని చేస్తామని తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

- Advertisement -