హరితహారంలో పాల్గొనండి:ఎర్రబెల్లి

371
errabelli dayakar rao

ప్రతి ఒక్కరు హరితహారంలో పాల్గొనాలని సూచించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ జిల్లాలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడిన ఎర్రబెల్లి తెలంగాణ రాష్ట్రం లో ప్రతీ జిల్లా..ప్రతి అంశం లో అభివృద్ధి కావాలన్నారు.క్షేత్ర స్థాయి వరకు సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని అధికారులకు సూచించారు.

హరితహారం లో ప్రజలు కోరుకునే చెట్లు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని… ప్రతి డిపార్ట్‌మెంట్ అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు .భారతదేశం లోనే హరితహారం కి గొప్ప పేరు రావాలన్నారుజ

పట్టాదారు పాస్ బుక్‌ల పంపిణీ 80 శాతం పూర్తయిందని చెప్పారు ఎర్రబెల్లి. చాలా చోట్ల ఇబ్బంది కరమైన పరిస్థితులు ఉన్నాయని..పోడు భూముల పైన సమస్యలను తీర్చాలన్నారు.అధికారులు చాకచక్యంగా వ్యవహరించి… ఆరు జిల్లా లోని అన్నీ గ్రామాలు odf గ్రామాలు అయ్యేందుకు కృషి చేయాలన్నారు.

రైతులకు ప్రభుత్వం అన్నీ రకాలుగా సహకరిస్తుందని..అగ్రీ కల్చర్ అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు సలహా లను ఇవ్వాలన్నారు.ఆసరా పెన్షన్ లను జులై 1 నుంచి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడాలని సూచించిన ఎర్రబెల్లి బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాల లో చదివేల చైతన్యం చేయాలన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా,ఎవరూ చేయలేని విధం గా అతి తక్కువ వ్యవధిలో కాళేశ్వరం ప్రాజెక్టుని సీఎం కేసీఆర్ పూర్తి చేశారని చెప్పారు. కాళేశ్వరంతో లాభపడే మొదటి జిల్లా వరంగల్‌ అని చెప్పిన ఎర్రబెల్లి తెలంగాణ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటోందన్నారు.