హరితహారంతో ఆకుపచ్చ తెలంగాణ:ఎర్రబెల్లి

345
errabelli

రంగారెడ్డి జిల్లా పరిషత్ ఆవరణలో మామిడి మొక్కనాటిన పంచాయతీ రాజ్, గ్రామీణ అభవృద్ధి, ఆర్.డబ్లూ.ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రంగారెడ్డి జిల్లా పరిషత్ కొత్త చైర్ పర్సన్ తీగల అనితారెడ్డికి అభినందనలు తెలిపారు.

dayakar rao

హరిత హారంతో తెలంగాణ ఆకుపచ్చ తెలంగాణగా మారుతుందన్నారు ఎర్రబెల్లి. ప్రతి ఒక్కరూ హరిత హారంలో పాల్గొనాలని సూచించిన ఎర్రబెల్లి…. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు.

సీఎం కేసీఆర్ తెచ్చిన కొత్త పంచాయతీరాజ్ చట్టంతో స్థానిక సంస్థలు బలోపేతమవుతాయన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అధికారాలతో పాటు బాధ్యతలు పెరిగాయని తెలిపారు. అధికారాలు దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నూతన జిల్లా పరిషత్ చైర్ పర్సన్లకు, వైస్ చైర్మన్ లకు, జెడ్పీటీసీ లకు శుభాకాంక్షలు తెలిపారు.