జనగామలో ధాన్యం కొనుగోలు పద్దతిని పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రైతులు,అధికారులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంతకముందు జనగామ ఏరియా హాస్పిటల్ లో వైద్యులకు పీపి ఇ కిట్ల ను పంపిణీ చేశారు ఎర్రబెల్లి. కరోనా వైరస్ నిర్మూలన, చికిత్స, అందుబాటులో ఉన్న రోగ నిర్ధారణ పరీక్షల పరికరాలు, వైద్య సదుపాయాల పై డాక్టర్లు, సూపరింటెండెంట్ తో మాట్లాడి తెలుసుకున్నారు.
అవసరార్థం వచ్చే పేషంట్ల కు మంచి వైద్యం అందించాలన్నారు ఎర్రబెల్లి. కరోనా వైరస్ నిర్మూలన, చికిత్స లో వైద్యుల సేవలు నిరుపమానమైనవి అని కొనియాడారు. వైద్యులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టిమరి పని చేస్తున్నారు..వారి సేవలను ప్రపంచం మరచిపోదు. వేనోల్ల కొనియాడుతున్నారని తెలిపారు.ప్రజలు వైద్యులకు సహకరించాలి…కరోనా నిర్మూలన జరిగే వరకు సీఎం కెసిఆర్ చెప్పినట్లు పూర్తి లాక్ డౌన్ పాటించాలన్నారు.