పూర్ణ సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం..

202
Errabelli Dayakar
- Advertisement -

త‌న వ‌ద్ద సోష‌ల్ మీడియాకు ప‌ని చేసిన పూర్ణ చందర్ సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. గ‌తంలో త‌న వ‌ద్ద సోష‌ల్ మీడియా ఇన్ చార్జీగా ప‌ని చేస్తూ, దుర‌దృష్ట‌వ‌శాత్తు జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన పూర్ణ చంద‌ర్ మొద‌టి వ‌ర్దంతికి మంత్రి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పూర్ణ చిత్ర‌ప‌టానికి పూలు చ‌ల్లి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించి నివాళుల‌ర్పించారు. అత‌డి పిల్ల‌ల‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకుని త‌న ఆత్మీయ‌త‌ని చాటారు. వారి బాగోగులు, చ‌దువులు త‌నే చూస్తున్న మంత్రి, కంట‌త‌డి పెట్టారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అకాల మ‌ర‌ణం అత్యంత బాధాక‌ర‌మ‌న్నారు. కొన్ని సంఘ‌ట‌న‌లు మ‌న‌పై చెర‌గ‌ని ముద్ర వేస్తాయ‌ని, అలాంటిదే పూర్ణ మ‌ర‌ణ‌మ‌ని బాధ‌ప‌డ్డారు. వారి కుటుంబాన్ని ఓద‌ర్చారు. అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

- Advertisement -