గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న పర్యావరణవేత్త ఎరిక్ సోలీహిమ్..

78
gic
- Advertisement -

రాజస్థాన్ లోని జైపూర్ లో శ్రీకల్పతరు సంస్థాన్‌ ఆధ్వర్యంలో వృక్ష మిత్ర సమ్మాన్ సమరోహ్ కార్యక్రమం జరుగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణవేత్త ఎరిక్ సోలీహిమ్. ఈ సందర్భంగా ఆకుపచ్చ కండువాతో ఎరిక్ సోలీహిమ్ ను సత్కరించారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు. అనంతరం వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు.

అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జైపూర్ లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎరిక్ సోలీహిమ్. రాజస్థాన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో మొక్కలు నాటారు ఎరిక్ సోలీహిమ్.

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం బాగుందని తెలిపారు. జైపూర్ లో కూడా మొక్కలు నాటడం గొప్ప విషయం….మొక్కలు నాటేందుకు తెలంగాణ, రాజస్థాన్ కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -