నేటి రోజుల్లో చాలా మంది పురుషులు ఎదుర్కొనే లైంగిక సమస్య అంగస్తంభన. ప్రతి పది మందిలో ముగ్గురు లేదా నలుగురు పురుషులు ఈ సమస్యతో బాధ పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సమస్య కారణంగా ఎంతో మంది మానసిక క్షోభ అనుభవిస్తుంటారు. నలుగురికి చెప్పుకునే సమస్య కాకపోవడంతో వారి బాధను ఇతరులతో పంచుకోలేక వారిలో వారి కుమిలి పోతుంటారు. ఇంకా కొంతమంది వైద్యుడికి కూడా ఈ సమస్య చెప్పుకోవడానికి సిగ్గు పడుతుంటారు. అయితే ఇదో సాధారణ సమస్య ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తీసుకునే ఆహారం విషయంలోనూ, జీవన శైలిలోనూ జాగ్రత్తలు తీసుకుంటే ఈ అంగస్తంభన సమస్యను ఈజీగా అధిగమించవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. .
వీటి కారణంగా పురుషుల్లో టెస్టోస్టిరాన్ లోపిస్తుంది. తద్వారా అంగస్తంభన వంటి సమస్యలు అధికమవుతాయి. కాబట్టి అలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇక నేటి రోజుల్లో చాలామంది శారీరక శ్రమకు దూరమవుతున్నారు. పురుషులలో అంగస్తంభన సమస్య రావడానికి ఇది కూడా ఒక కారణం. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరుగుతాయి. తద్వారా పురుషుల్లో శృంగార సమస్యలు తలెత్తవు. ఇంకా తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
కూరగాయలు, ఆకుకూరలు, తృణ ధాన్యాలు.. ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా అధిక బరువు కూడా అంగస్తంభనకు కారణం కావొచ్చు. కాబట్టి ఎందుకంటే అధిక బరువు టైప్ 2 డయాబెటిస్ కు కారణమౌతుంది. ఇది అంగస్తంభనకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి బరువు తగ్గాలి. ఇంకా అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన.. వంటి రుగ్మతలు కూడా అంగస్తంభనకు కారణంగా చెప్పవచ్చు. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల సహజసిద్దంగా అంగస్తంభన సమస్యకు చెక్ పెట్టవచ్చు.
Also Read:చామదుంప తింటే ఎన్ని ప్రయోజనాలో..!