గతేడాది సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, కోలీవుడ్, బాలీవుడ్ లో ఒక్కో డిజాస్టర్లతో పలకరించింది కాజల్ అగర్వాల్. అయితేనేం జనతా గ్యారేజ్ లో చేసిన పక్కా లోకల్ సాంగ్ తో ఓ ఊపు ఊపేసింది చందమామ. ఓవైపు ఖైదీ నంబర్ 150 తో సక్సెస్ అందుకుంది కాజల్. ఇప్పుడు రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ తమిళంలో `కవలై వేండాం` తెలుగులో `ఎంత వరకు ఈ ప్రేమ` సినిమాతో మళ్లీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈనెల 7న (ఏప్రిల్ 7)న థీయేటర్లలోకి వస్తోంది. `రంగం` ఫేం జీవా హీరోగా యామిరుక్క బయమేన్` ఫేమ్ డీకే దర్శకత్వం వహించారు.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెల 7న విడుదల చేస్తున్నట్టు నిర్మాత డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ వెల్లడించారు.
ఈ సందర్భంగా డి.వెంకటేష్ మాట్లాడుతూ “తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో పరిచయమైన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిది. అన్ని పనులు పూర్తి చేశాం. ఈనెల 7న సినిమాని రిలీజ్ చేస్తున్నాం. `రంగం` చిత్రాన్ని తమిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను తమిళంలో నిర్మించి రిలీజ్ చేశారు. అక్కడ పెద్ద విజయం అందుకుని ఇప్పుడు తెలుగులో వస్తోంది. తెలుగు ట్రైలర్స్, పాటలు ఆకట్టుకున్నాయి. జీవా, కాజల్ నటన యువతరానికి క్రేజీగా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకుల్ని వంద శాతం మెప్పించే చిత్రమిది“ అన్నారు.