పరువు నిలుపుతారా..!

223
kohli
- Advertisement -

భారత్, ఇంగ్లండ్ మధ్య చివరిదైన ఐదోటెస్టు నేటినుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ కొల్పోయిన భారత్ ఇంటా బయట తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. కోచ్ రవిశాస్త్రి,కెప్టెన్ విరాట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్లు సైతం వీరిద్దరి వైఖరిని తప్పుబడుతు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఐదోటెస్టు వీరిద్దరికి అగ్నిపరీక్ష కానుంది.

ఈ నేపథ్యంలో తుదిజట్టులో మార్పులు చేసేందుకు సిద్ధమయ్యాడు విరాట్. యువ ఆటగాడు హనుమ విహారికి తుదిజట్టులో స్ధానం దక్కే అవకాశం ఉంది. కొంతకాలంగా విఫలమవుతున్న వస్తున్న రవీచంద్రన్ అశ్విన్ స్ధానంలో రవీంద్రజడేజాకు తుదిజట్టులో స్ధానం దక్కేఅవకాశం ఉంది. ఇక అటు వరుస విజయాలతో జోష్ మీదున్న ఇంగ్లీష్ జట్టు పెద్దగా మార్పులేకుండానే బరిలో దిగే అవకాశం ఉంది.

కెన్నింగ్టన్ ఓవల్ లో జరిగే మ్యాచ్ కోసం టీమిండియా సీరియస్ గా ప్రాక్టీస్ చేసింది. చివరిదైన ఐదో టెస్టులో ఐనా గెలిచి పరువునిలుపుకోవాలని భావిస్తోన్న కోహ్లీ సేన ఎలాంటి ఫలితాన్ని ఎదుర్కొంటుందో వేచిచూడాల్సిందే.

- Advertisement -