- Advertisement -
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌లో శనివారం చివరి మ్యాచ్ జరగనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్ 2-2తో సమంగా ఉండగా చివరి టీ20లో గెలిచి సిరీస్ నెగ్గాలని పట్టుదలతో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుదే సిరీస్ కావడంతో పోరు హోరాహోరీగా సాగనుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైన బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ స్థానంలో స్పీడ్‌స్టర్ నటరాజన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు.
- Advertisement -