భారత్‌ను చిత్తు చేసిన ఇంగ్లాండ్‌..

203
england vs india
- Advertisement -

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌లో కీలకమైన మూడో వన్డేలో కోహ్లీ సేన పరాజయం పాలైంది. బ్యాటింగ్,బౌలింగ్ అన్నిరంగాల్లో విఫలమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొమ్మిది సిరీస్‌ విజయాల తర్వాత తొలి సిరీస్ ఓటమిని మూటగట్టుకుంది.

తొలుత టాస్ గెలిచిన భారత్‌కు నిరాశే ఎదురైంది. పేలవ ఆటతో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నిరాశపర్చారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (71; 72 బంతుల్లో 7×4) విలువైన ఇన్నింగ్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ధావన్‌ (44; 49 బంతుల్లో 7×4), ధోని (42; 66 బంతుల్లో 4×4) రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 256 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో రషీద్,విల్లీ చెరో మూడు వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించారు.

257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆడుతూ పాడుతు లక్ష్యాన్ని చేధించింది. కీలక మ్యాచ్‌లో స్పిన్నర్లూ చేతులెత్తేశారు. దీంతో భారత్‌ ఎక్కడ ఇంగ్లాండ్‌ను నిలవరించలేకపోయింది. రూట్‌ (100 నాటౌట్‌; 120 బంతుల్లో 10×4), మోర్గాన్‌ (88 నాటౌట్‌; 108 బంతుల్లో 9×4, 1×6) మెరవడంతో లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 44.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. టెస్టు సమరానికి ముందు టీమ్‌ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి మ్యాచ్‌ ఆగస్టు 1న బర్మింగ్‌హామ్‌లో ప్రారంభంకానుంది.

- Advertisement -