వరల్డ్‌కప్ గెలిచే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది భారత మహిళల జట్టు. చివరివరకు పోరాడినా.. ఓటమి తప్పలేదు. ఐసీసీ మహిళల వల్డ్ కప్ ఫైనల్ పోరులో భారత్‌పై ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. 229 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌటైంది.
మంధన 0, మిథాలీ రాజ్ 17, హర్మన్ ప్రీత్ కౌర్ 51, రౌత్ 86, స్మృతీ వర్మ 0, వేద కృష్ణమూర్తి 35, జె.గోస్వామి సున్నా, పాండే 4, దీప్తీ శర్మ 14, గైక్వాడ్ సున్నా పరుగులు చేసి అవుటయ్యారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఇంగ్లిష్ బ్యాట్స్ విమెన్‌లలో లారెన్ విన్‌ఫీల్డ్ 24, టామీ బీమౌంట్ 23, సారా టేలర్ 45, నటాలీ షివర్ 51, కేథరిన్ బ్రంట్ 34, జెన్నీ గన్ 25, లారా మార్ష్ 14 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో ఝులన్ గోస్వామి 3, రాజేశ్వరి గైక్వాడ్ 1, పూనమ్ యాదవ్ 2 వికెట్లు తీశారు.