పాకిస్థాన్లో వచ్చిన వరదల కారణంగా దెబ్బతిన్న ప్రజల కోసం ప్రముఖ ఇంగ్లండ్ క్రికెటర్ తన మూడు మ్యాచ్ల ద్వారా వచ్చే విరాళంను ప్రకటించారు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ మానవత్వాన్ని చాటుకున్నాడు.
పొట్టి ప్రపంచకప్ విజయం తర్వాత తొలిసారి పాక్ టూర్‌లో ఉన్న ఇంగ్లండ్ జట్టు 3టెస్టులు ఆడనున్నారు. ఇందులో భాగంగా తనకు వచ్చే ఫీజును పాకిస్థాన్‌లోని వరదల కారణంగా నష్టపోయిన వారికి విరాళంగా ఇవ్వనున్నారు. పాకిస్థాన్‌లో ఈ ఏడాది వరదల కారణంగా దెబ్బతిన్న నగరాల పునర్మిణాం కోసం ఈ డబ్బును ఉపయోగించాలని ఇవాళ ట్వీట్ చేశాడు.
రావల్పండిలో డిసెంబర్1 నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ యేడాది జరిగిన వరదల కారణంగా పాకిస్థాన్లో 33మిలియన్ల మందికి నిరాశ్రయులయ్యారు. 1700 ప్రజలు మరణించారని తెలిపారు.
I’m donating my match fees from this Test series to the Pakistan Flood appeal ❤️🇵🇰 pic.twitter.com/BgvY0VQ2GG
— Ben Stokes (@benstokes38) November 28, 2022
ఇవి కూడా చదవండి…