జార్ఖండ్‌ సీఎం ఇంటిపై ఈడీ దాడులు

77
soren
- Advertisement -

జార్ఖండ్​ సీఎం హేమంత్ సోరెన్ ఇంటిపై దాడులు నిర్వహించింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. టెండర్‌ స్కామ్‌ వ్యవహారంలో సీఎం హేమంత్‌ సహా ఆయన సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సీఎం సోరెన్‌పై ఇప్పటికే మైనింగ్‌ కుంభకోణం ఆరోపణలు రాగా ఈ వ్యవహారంలో ఈడీ గతంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసింది.

తాజాగా టెండర్ స్కామ్‌లో సాహెబ్​గంజ్​, మీర్జా చౌకీ, బెర్హత్‌​, రాజ్‌మహల్ సహా మొత్తం 18 ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే సోదాలు చేస్తున్నారు. సీఎం సోరెన్ ప్రతినిధి పంకజ్​ మిశ్రా ఇండ్లలోనూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -