మంత్రి జగదీష్ రెడ్డి నిర్ణయానికి రైతుల హర్షం..

539
jagadhish reddy
- Advertisement -

మూసి ఆయకట్టు క్రింద రబీ పంటకు సాగు నీరు రాదని కొంత మంది పనికట్టుకుని చేస్తున్న ప్రచారంతో రైతులలో కలిగిన అయోమయానికి తెర పడింది.. రైతుల కోరిక మేరకు డిసెంబర్ 15 నుండి మూసి ఆయకట్టుకు రబీ పంటకు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మూసి డ్యాం అధికారులను ఆదేశించారు. ఈ రోజు సూర్యాపేట రూరల్ మండలం ఏండ్ల పల్లిలో ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న మంత్రి టేకుమట్ల వద్ద మూసి కాలువలను పరిశీలించారు. ఇదే సమయంలో మంత్రిని కలువడానికి పెద్ద ఎత్తున రైతులు వచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి రబీ నీటి విడుదల విషయంలో ఆయకట్టు రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 15 నుండి నీటిని విడుదల చేయాలని రైతులు కోరడంతో రైతుల అభిప్రాయాలను గౌరవించిన మంత్రి అక్కడికక్కడే నీటి విడుదలపై నిర్ణయం తీసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రబీకి సాగు నీరు ఇచ్చి తీరుతామని చెప్పిన మంత్రి గత పాలకుల హయాంలో మూసి ఆయకట్టు రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉండేవన్నారు. 2014 కంటే పాలించిన పాలకులకు ఏనాడు మూసి ఆయకట్టు రైతులను పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. 2014లో టి. ఆర్.ఎస్ ప్రభుత్వం వచ్చాకే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో మూసీ ఆయకట్టు పరిధిలో రైతులు రెండు పంటలు సాగు చేసుకోగలుగుతున్నారన్నారు.

minister jagadish reddy

ప్రస్తుతం రైతులకు తమ భూములను సాగు చేసుకుంటుంటే కొంత మంది కళ్ళ నుండి నీరు వస్తుందన్నారు. నీటి విడుదల విషయంలో తమ వద్దకు వచ్చి తమ అభిప్రాయాలను అడిగి తెలుసుకునటమే కాకుండా రైతుల అభిప్రాయాలకు విలువ ఇచ్చిన నేతను తమ జీవిత కాలంలో చూడటం ఇదే ప్రదమమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూసి గేట్ ఊడి పోవడంతో ఈ సారి రబి పంటకు నీళ్ళు రావని దిగులు చెందిన తమను గంటల వ్యవధి లొనే గేటు బిగించి తమ దృష్టిలో అసలు సిసలైన నాయకుడుగా మంత్రి జగదీష్ రెడ్డి నిలిచారని రైతులు తెలిపారు. అంతే కాకుండా మూసిలో రబీ పంటకు సాగు నీరు రాదని కొంత మంది పని గట్టుకుని చేసిన ప్రచారంతో డీలా పడిన తమకు మంత్రి జగదీష్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఉత్సాహంగా రబీ పంటకు సిద్దం అవుతున్నామని రైతులు తెలిపారు. మంత్రి తీసుకున్న నిర్ణయంతో ఆయకట్టు పరిధిలో కుడి, ఎడమ కాలువల పరిధిలో సుమారు 40 వేల ఎకరాలు సాగు కానుంది.

Power Minister G Jagadish Reddy on Firsday instructed the officials to make arrangements at the Musi Water Release..

- Advertisement -