- Advertisement -
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆపరేషన్ కర్రెగుట్టలో భాగంగా భద్రతా బలగాల కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మావోయిస్టు కీలక నేతలే టార్గెట్‌గా కూంబింగ్ జరుగుతోంది. అయితే కూంబింగ్ ఆపాలని ఇప్పటికే మావోయిస్టుల విజ్ఞప్తి చేసినా భద్రత దళాలు మాత్రం వెనక్కి తగ్గలేదు.
ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టలను చుట్టుముట్టి హెలికాప్టర్ల ద్వారా గుట్టలపై ఉన్న మావోయిస్టుల కోసం జల్లెడపట్టారు పోలీసులు. కర్రెగుట్ట మావోయిస్టులకు సురక్షిత స్థావరంగా ఉండగా పోలీసులు కూంబింగ్‌తో అగ్రనేతలు చనిపోయినట్లు తెలుస్తోంది.
కొద్ది రోజులుగా జరుగుతున్న కాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు.
Also Read:హుస్సేన్ షా కుటుంబానికి రూ.5లక్షల సాయం: షిండే
- Advertisement -

