- Advertisement -
మరోసారి కాల్పుల మోతతో ఛత్తీస్‌గఢ్ దద్దరిల్లింది. కొంతకాలంగా వరుస ఎన్‌కౌంటర్లతో పెద్ద ఎత్తున మావోలు హతం అవగా తాజాగా మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు హతం అయ్యారు.
కొండగావ్-నారాయణ్‌పుర్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తలదాచుకుని ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ దశలో భద్రతా సిబ్బందిని చూసిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించగా, బలగాలు కూడా ఎదురుగా కాల్పులు జరిపాయి.
ఎన్‌కౌంటర్ ముగిసిన అనంతరం భద్రతా బలగాలు ఇద్దరి మృతదేహాలు, ఒక ఏకే-47 తుపాకీని స్వాధీనం చేసుకున్నాయి. మృతులు మావోయిస్టు అగ్రనేతలు అని తెలుస్తుండోగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:కొండారెడ్డిపల్లికి రైతు కమిషన్
- Advertisement -