- Advertisement -
మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది ఛత్తీస్‌గఢ్. గురువారం బీజాపుర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటనలో 26మంది మావోయిస్టులు మృతి చెందారని సమాచారం. అలాగే ఒక జవాన్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
అడవుల్లో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టగా ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 26 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందగా మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
బీజాపూర్ జిల్లాలోని గంగలూరు ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులున్నారని సమాచారం అందడంతో బలగాలను పంపినట్లు ఎస్పీ జితేంద్రయాదవ్ వెల్లడించారు. ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు.
Also Read:రాజాసింగ్‌కు పోలీసుల కీలక సూచన
- Advertisement -