సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు- ఉద్యోగ జేఏసీ

246
employees jac
- Advertisement -

కోవిడ్-19 సందర్భంగా గత మూడు నెలలుగా కోత విధించిన జీతాలను జూన్ నెలలో పూర్తిగా చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించినందుకు వారికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నప్పటికిని, కరోనా కట్టడిలో నిరంతర సేవలు అందిస్తున్న ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ నెల పూర్తి జీతాలు చెల్లించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు.

మూడు నెలలుగా కోత విధించిన జీతాలను త్వరలో చెల్లించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నామని ఉద్యోగుల జేఏసీ తెలిపింది. అలాగే ముఖ్యమంత్రి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అనగా పదవి విరమణ వయస్సు పెంపు, వేతన సవరణను త్వరలో మంజూరు చేస్తారని ఆశిస్తున్నామన్నారు.

- Advertisement -