పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ..!

11
- Advertisement -

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో వైమానిక దాడి నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

భారత దాడులకు ప్రతీగా పాకిస్తాన్ కూడా వైమానిక దాడులకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలపై పాక్ రేంజర్లు కాల్పులు జరపగా 10 మంది మృతి చెందారు. ఇక అలాగే పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. అన్ని ఎయిర్పోర్టులను, విద్యాసంస్థలను, వాణిజ్య సంస్థలను మూసివేశారు.

మెడికల్ ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. భారత్‌ మెరుపుదాడులతో లాహోర్‌, సియాల్‌కోట ఎయిర్‌పోర్ట్‌లు మూసివేశారు. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. పాక్‌ పంజాబ్‌లో విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశించారు.

Also Read:ఉగ్రశిబిరాలను తుడిచిపెట్టాం:సోఫియా ఖురేషి

- Advertisement -