ట్విట్టర్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు సీఈవో ఎలన్ మస్క్. కంటెంట్ మాడరేషన్‌లో భాగంగా ఫేక్ అకౌంట్స్‌పై దృష్టి సారించారు. రాజకీయ నాయకులు, హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీల ఫ్యాన్ పేజీకి సంబంధించిన అడ్మిన్ వివరాలను తెలిపాలన్నారు. ఏ పేజ్ నడుపుతున్నారో ట్విట్టర్ కి సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తూ, బయోలో మెన్షన్ చేయాలని లేకుంటే ఆ ట్విట్టర్ అకౌంట్ కు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అకౌంట్ ని శాశ్వతంగా బ్లాక్ చేయనున్నట్టు సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు.
ఇక అలాగే ఆదాయ మార్గాలపై దృష్టిసారిస్తున్న మస్క్… బ్లూటిక్ ఖాతాలకు నెలకు 8డాలర్ల చొప్పున ఫీజు విధించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మస్క్ నిర్ణయం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మంది ప్రముఖులు తమ డిస్ ప్లే పేరును ఎలాన్ మస్క్ గా మార్చి, వారి ఖాతాకు మస్క్ ఫొటో పెట్టి ట్వీట్లు చేస్తుండటంతో మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్విటర్ డిస్ ప్లేలో ఖాతా పేరుకు బదులు వేరొక పేరును వాడితే శాశ్వతంగా ట్విటర్ నుంచి ఆ ఖాతాను తొలగిస్తామని అన్నారు.