సంగమేశ్వరుడికి ఎల్‌నినో ఎఫెక్ట్‌?

1
- Advertisement -

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గడంతో దాని బ్యాక్‌వాటర్‌లో మునిగి ఉండే ప్రసిద్ధ సంగమేశ్వర ఆలయం నీటి నుంచి బయటపడుతోంది.

సాధారణంగా ఏడాదిలో దాదాపు 9 నెలల పాటు జలధిలోనే (నీటి అడుగున) ఉండే సంగమేశ్వర స్వామి ఈసారి కేవలం నెల రోజుల వ్యవధిలోనే బయటకు కనిపించడం పండితులను, భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది.

పుష్కర కాలం (12 ఏళ్లు) తర్వాత మళ్లీ ఇలాంటి అరుదైన, ఆందోళనకర పరిస్థితి తలెత్తడం ఇదే తొలిసారని ప్రముఖ పండితుడు రఘురామ శర్మ పేర్కొన్నారు.

నదీ జలాలు వేగంగా అడుగంటిపోతుండటంతో రాబోయే రోజుల్లో సాగునీటితో పాటు పశువులకు తాగునీటి సమస్య తీవ్రంగా తలెత్తుతుందని రాయలసీమ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:లాల్‌బాగ్చా..భక్తుల జనసందోహం

జలాశయంలో నీటి మట్టం ఇదే రీతిలో పడిపోతే ప్రాంతంలో తీవ్రమైన కరువు పరిస్థితులు దాపురించే ప్రమాదం ఉందని స్థానిక ప్రజలు, రైతులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -