‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ సాంగ్ ప్రోమో

373
songvalmiki
- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం వాల్మీకి. పూజా హెగ్డె హీరోయిన్ గా నటించింది. ఇటివలే ఈసినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తమిళ్ లో భారీ విజయం సాధించిన జిగర్తాండ మూవీకి రిమేక్ గా ఈమూవీని తెరకెక్కించారు.

ఇక ఈచిత్రాన్ని సెప్టెంబర్ 20న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అలనాటి ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ ను రీమిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ ప్రోమోను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. శోభన్ బాబు, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ఈ పాట ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఒరిజినల్ పాటకు ఏ మాత్రం తగ్గకుండా చిత్రకరించాడు దర్శకుడు హరీశ్ శంకర్.

- Advertisement -