ట్రంప్‌తో మస్క్ డిన్నర్..!

6
- Advertisement -

అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి ఆర్ఎఫ్ కెనడీ నివాసంలో ఏర్పాటు చేసిన ‘థ్యాంక్స్ గివింగ్’ విందులో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కలిసి డిన్నర్ చేశారు. అయితే ఇది రియల్‌ ఫోటోనా లేక ఏఐ ఫోటోని అందరిలో సందేహం నెలకొంది.

అయితే ఈ ఫోటో రియల్‌ దే అయినా 2024లోని ఫోటోకే కాపీగా ఉంది. అయితే, అప్పటి మెక్‌డొనాల్డ్స్ భోజనం స్థానంలో థ్యాంక్స్‌గివింగ్ విందు మార్చబడింది.
అమెరికన్లు థ్యాంక్స్‌గివింగ్ జరుపుకుంటున్న నేపథ్యంలో, అమెరికా ఆరోగ్య శాఖ కార్యదర్శి రాబర్ట్ ఎఫ్. కెన్నెడి జూనియర్ గురువారం డొనాల్డ్ ట్రంప్, టెస్లా CEO ఎలాన్ మస్క్‌లతో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశాడు.

“హ్యాపీ థ్యాంక్స్‌గివింగ్,” అని RFK జూనియర్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోను చూసిన వెంటనే, US అధ్యక్షుడు ట్రంప్ మరియు మస్క్‌ల మధ్య ఇటీవలి ఉద్రిక్తతలు తగ్గుతున్నాయా? అనే అనుమానం కలిగింది.కెన్నెడి పోస్ట్ చేసిన చిత్రంలో ట్రంప్, మస్క్ roasted turkey, mashed potatoes వంటి థ్యాంక్స్‌గివింగ్ డిష్‌లతో విమానంలో పోజులిచ్చారు.

కొన్ని వారాల క్రితం తీవ్ర సోషల్ మీడియాలో మాటల యుద్ధం తర్వాత మస్క్, ట్రంప్ మరియు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌తో వైట్ హౌస్‌లో విందుకు హాజరై వార్తల్లో నిలిచాడు. అప్పటి వైరల్ వీడియోలో ట్రంప్ మస్క్ పొట్టపై చప్పట్లు కొట్టిన దృశ్యం కూడా ఉంది.అయితే దగ్గరగా పరిశీలించగా, ఈరోజు షేర్ చేసిన ఫోటో 2024లో ట్రంప్ జూనియర్ షేర్ చేసిన ఫోటోకే పక్కాగా కాపీ అని తెలిసింది. అప్పట్లో ఆ ఫోటోకు క్యాప్షన్ — “Make America Healthy Again starts TOMORROW.” మార్చింది ఒక్కటే – మెక్‌డొనాల్డ్స్ భోజనం స్థానంలో థ్యాంక్స్‌గివింగ్ విందు పెట్టడం.

Also Read:బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్,బీజేపీ నాయకులు

చాలా మంది X (Twitter) యూజర్లు ఈ కొత్త ఫోటో కూడా AI ఎడిట్ అయ్యిందని కామెంట్ చేశారు. 250 ఏళ్ల అమెరికా స్వతంత్ర వేడుకలకు సన్నద్ధం అవుతున్న ఈ థ్యాంక్స్‌గివింగ్‌లో, మనకు ముందున్న మహానుభావుల విశ్వాసం, ధైర్యం, అంకితభావం గుర్తుపెట్టుకుందాం. భవిష్యత్తు కోసం అలాంటి విలువలతో ముందుకు సాగుదాం. ముఖ్యంగా, దేవుని ప్రేమ, కరుణ, ఆశీర్వాదాలకు మన అంతులేని కృతజ్ఞతలు తెలియజేద్దాం,” అని ట్రంప్ తన సందేశంలో తెలిపారు.

- Advertisement -