పాండ్యతో డేటింగ్..ఎల్లీ రియాక్ట్‌..

179
- Advertisement -

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య.. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో డేటింగ్‌ చేస్తున్నాడని, వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారంటూ గతంలో ఓ రేంజ్‌లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి వార్తలన్నీ రూమర్లేనని, తాను ఎవరినీ ప్రేమిచడం లేదని హార్దిక్ స్వయంగా ప్రకటించడంతో ఈ వార్తలకు పులిస్టాప్ పడింది.

ఇదిలాఉంటే… హార్దిక్‌ పాండ్య బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హార్దిక్‌ సోదరుడు కృనాల్‌ పాండ్య వివాహ వేడుకకు హాజరైన ఎల్లీ.. హార్దిక్‌ పక్కనే నిలబడి ఫొటో దిగడంతో ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. తాజాగా ఈ విషయంపై ఎల్లీ స్పందించింది.

elli avrram react on dating with pandya

‘ఇప్పుడు నేనేం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నా గురించి వాళ్లు ఏమన్నా అనుకోనివ్వండి. ప్రతి విషయంలో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటివరకు నా గురించి అనేక తప్పుడు వార్తలు రాశారు. హార్దిక్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ వస్తున్న వదంతులపై స్పందిస్తే.. నాకు నేనే మరిన్ని పుకార్లు సృష్టించుకున్నట్లు అవుతుంది’ అని ఎల్లీ పేర్కొంది.

తనపై రాసిన వార్తల గురించి తానెప్పుడూ స్పందించలేదని, సెలబ్రిటీల జీవితమంటే ఇలాగే ఉంటుందని ఎల్లీ చెప్పుకొచ్చింది. ‘కొంత మంది ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలా అని మేం మా పనులను మానుకోలేం’ అని పేర్కొంది.

- Advertisement -