చిత్తూరులో ఏనుగుల బీభత్సం..

35

మంగళవారం చిత్తూర్ జిల్లా రామకుప్పం మండల పరిధిలోని గిడ్డపల్లి, సాగినేపల్లి మరియు ముద్దనపల్లి సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. మూడు రోజులుగా మండలం సమీప గ్రామాలలో ఏనుగుల గుంపు తిష్ట వేసింది.. దీంతో గ్రామలలోని ప్రజలు, రైతులు ఏనుగులు ఎప్పుడు ఏ సమయంలో పంటలపై, తమపై దాడి చేస్తుందోనని బిక్కుబిక్కుమాంటు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఏనుగులను అటవీ ప్రాంతానికి తరిమివేయుటకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.