జంతు ప్రేమికులకే కాదు అందరికి కన్నీళ్లు తెప్పిస్తోంది ఈ వీడియో. రష్యాలో 25 ఏళ్లుగా కలిసే ఉన్న సర్కస్ ఏనుగులు జెన్నీ ,మాగ్డా ఇటీవల రిటైర్మెంట్ తర్వాత ప్రశాంత జీవితం గడుపుతున్నాయి. అయితే, ఈ వారం అకస్మాత్తుగా జెన్నీ కుప్పకూలి మరణించడంతో, మాగ్డా తన మిత్రురాలిని లేపేందుకు ప్రయత్నించిన హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
స్నేహితురాలు ఎంతకు లేకపోవడంతో మాగ్డా అక్కడి నుండి వెళ్లకుండా కొన్ని గంటల పాటు పక్కనే నిలబడింది. పరీక్షించేందుకు వచ్చిన వెటర్నరీ డాక్టర్లను కూడా అడ్డుకుందదని స్థానికులు తెలిపారు.
దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తన హృదయానికి అత్యంత ప్రియమైనవారు తన కళ్లముందే మరణించడం కన్నా పెద్ద బాధ ఏదీ లేదు అని చెప్పారు. రష్యాలోని కజాన్ నగరంలో వీరు సర్కస్ ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
2021లో జరిగిన సంఘటనల కారణంగా వీటిని రిటైర్ చేశారు. ఓ ప్రదర్శన సమయంలో అకస్మాత్తుగా ఈ రెండు ఏనుగులు దాడి చేసుకోవడంతో ప్రేక్షకులు భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత ఏనుగలను చూసే శిక్షకుడిపై సైతం దాడి చేశాయి. ఆ తర్వాత ఈ ఏనుగులు ప్రదర్శన ఇవ్వలేదు.
😢💔 An elephant mourns her deceased friend
In occupied Crimea, the famous elephant Jenny passed away due to illness.
Her companion, Magda, refused to let people approach for hours, hugging Jenny and staying by her side for a long time. pic.twitter.com/nY5FRJueHp
— Based & Viral (@ViralBased) March 14, 2025
Also Read:గ్రీన్ కార్డు..శాశ్వత నివాసం కాదు: జేడీ వాన్స్

