మాజీ సీఎం ఇంటికి కరెంట్ నిలిపివేత

371
up Mayavathi
- Advertisement -

యూపీ మాజీ సీఎం, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రీకి విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. మాయవతి నివాసానికి కరెంట్ సరాఫరాను నిలిపివేశారు. మాయవతి నివాసం ఉంటున్న ఇళ్లు కరెంట్ బిల్లు చాలా కాలంగా చెల్లించకపోవడంతో ఆమె ఇంటికి కరెంట్ కట్ చేశారు అధికారులు. గ్రేటర్ నోయిడాలోని ఆమె నివాసంలో రూ. 67 వేల వరకు బిల్లు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

మాయవతి ఇంటికి కరెంట్ నిలిపివేయడంపై ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని అధికారులు వెల్లడించారు. దీంతో వెంటనే మాయవతి కుటుంబ సభ్యలు రూ.50వేలు చెల్లించారు. బిల్లు కట్టడంతో అధికారులు కరెంట్ సరాఫరాను పునరుద్దరించారు. మాజీ సీఎం ఇంటికి కరెంట్ సరాఫరా నిలిపివేయడంపై తప్ప పట్టారు బీఎస్పీ నేతలు.

- Advertisement -