షెడ్యూల్ ప్రకారమే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు!

60
- Advertisement -

ఈ ఏడాది చివరలో తెలంగాణలో వచ్చే ఏడాది ప్రారంభంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ ఉండగా అన్నిపార్టీలు గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి షెడ్యుల్ ప్రకారం డిసెంబ‌ర్‌లోపు తెలంగాణ‌, ఛ‌త్తీస్ గ‌ఢ్, రాజస్ధాన్, మ‌ధ్యప్రదేశ్, మిజోరం అసెంబ్లీ ఎన్నిక‌లు జరగాల్సి ఉంది. ఆ త‌ర్వాత ఆరు నెలల్లోనే లోక్ స‌భ ఎన్నిక‌లతో పాటు మరో 4 రాష్ట్రాల ఎన్నిక‌లు జరగాలి. అయితే కేంద్రం మాత్రం తెలంగాణలో పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించి కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది.

Also Read:బత్తాయి రసం తాగుతున్నారా.. ఇవి తెలుసుకోండి!

ఇక ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఎం జగన్ ప్రకటించారు.దీంతో ఏపీలో ముందస్తు ఎన్నికలకు బ్రేక్ పడింది.ఏపీలో ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉండటంతో ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండాలని సూచించారు జగన్. కష్టపడితేనే మళ్లీ అధికారం దక్కుతుందని సూచించారు.

తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. అధికార బీఆర్ఎస్ జిల్లాల వారిగా బహిరంగసభలతో ముందుకు సాగుతోంది. ఓవైపు సీఎం కేసీఆర్ మరోవైపు కేటీఆర్ విస్తృతంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తాము చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచుతున్నారు.

- Advertisement -