జమ్మూలో కాంగ్రెస్‌ కూటమి..హర్యానాలో హోరాహోరీ

10
- Advertisement -

జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చగా హర్యానాలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. తొలుత కాంగ్రెస్‌ లీడ్‌లో ఉండగా తాజాగా బీజేపీ మేజిక్ ఫిగర్‌ను దాటి ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

జమ్మూలో ఆర్టికల్​ 370 రద్దు తర్వాత జరిగిన ఎన్నికలు కావడం వల్ల జమ్ముకశ్మీర్​ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఎన్‌సీ కలిసి పోటీ చేశాయి. బీజేపీ, పీడీపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. అయితే, ఇక్కడ ఐదుగురుఎమ్మెల్యేలను ఎల్‌జీ నామినేట్‌ చేయనున్నారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కు 48కి చేరనుంది.

జమ్ముకశ్మీర్‌లో 41 స్థానాల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్ 9 స్థానాల్లో ముందంజలో ఉండగా బీజేపీ 24, పీడీపీ 3, ఇతరులు 13 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. పోటీచేసిన రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు ఒమర్‌ అబ్దుల్లా. నౌషెరా నియోజకవర్గంలో జమ్ముకశ్మీర్​ బీజేపీ అధ్యక్షుడు రవిందర్ రైనా వెనుకంజలో ఉన్నారు.

హర్యానాలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది. బీజేపీ 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 34 స్థానాల్లో లీడ్‌లో ఉంది. గర్హి సంప్లా-కిలోయ్‌ స్థానంలో మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి భూపేంద్ర హుడ్డా ముందంజ ఉండగా ఆప్ ఖాతా తెరవలేదు.

Also Read:హైదరాబాద్‌లో అమ్రీష్ పురి మనవడు..

- Advertisement -