ఇవి ఉంటేనే..కౌంటింగ్‌కు అనుమతి:ఎన్నికల సంఘం

205
cec
- Advertisement -

మే 2న పలు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌తో పాటు రాష్ట్రంలో 2 కార్పొరేషన్‌లు,5 మున్సిపాలిటీలకు కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పలు కీలక సూచనలు చేసింది. మే 2న నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ రోజున పోటీ చేసిన అభ్య‌ర్థుల‌తో పాటు ఏజెంట్ల ప్ర‌వేశంపై ఆంక్ష‌లు విధించింది.

ఏజెంట్‌లు కౌంటింగ్ కేంద్రంలోకి అడుగుపెట్టాలంటే.. తప్పని సరిగా కౌంటింగ్ సమయానికి 48 గంటల ముందుగా రెండు డోసుల వ్యాక్సిన్ తో పాటు కరోనా నెగటివ్ రిపొర్టులు కలిగి ఉండాల్సిందేన‌ని స్పష్టం చేసింది. రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ రిపోర్ట్ తో పాటు కనీసం 48 గంటల ముందు పొందిన టీకా ధృవీకరణ పత్రాలను కూడా స‌మ‌ర్పించాల‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే ఫలితాల రోజున అన్ని విజ‌యోత్స‌వ ర్యాలీలు, ఊరేగింపులను ఎన్నికల సంఘం నిషేధించింది.

- Advertisement -