జనసేన దారి.. గోదారే!

50
- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న సంగతి విధితమే. ఏపీ జనసేన ప్రభావం గట్టిగానే ఉన్నప్పటికి తెలంగాణలో మాత్రం ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది. అయినప్పటికి ఎన్డీయేతో ఉన్న పొత్తు కారణంగా తెలంగాణలో పోటీకి సై అన్నారు అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఆ తరువాత అందరూ భావించినట్లుగానే బీజేపీ చేతులు కలిపి ఎన్నికల బరిలో నిలవనున్నారు. జనసేన బలం తమ పార్టీకి కలిసొస్తుందని కమలనాథులు కూడా గట్టిగా నమ్ముతున్నారు. అయితే జనసేనను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లే అంటున్నారు కొందరు రాజకీయ అతివాదులు. ఎనదుకంటే జనసేన పార్టీకి తెలంగాణలో బలం లేకపోగా.. ఆ పార్టీకి ప్రాంతీయ హోదా కూడా లేదు..

ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి కేటాయించాల్సిన గుర్తు విషయంలో ఈసీ గట్టిగానే షాక్ ఇచ్చింది. ఆ పార్టీ యొక్క గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ గా గుర్తించింది. ఈసీ రూల్స్ ప్రకారం జనసేన పార్టీకి ప్రాంతీయ గుర్తింపు లేదు. తద్వార ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇక పొత్తు కారణంగా బీజేపీ 8 స్థానాలను జనసేన పార్టీకి కేటాయించింది. ఈ ఎనిమిది స్థానాల్లోని అభ్యర్థులు ఎలాంటి గుర్తు లేకుండా బరిలో నిలవాల్సి ఉంటుంది. అలాగే జనసేన తరుపున నిలబడే మిగతా నేతల పరిస్థితి కూడా ఇదే. దీంతో జనసేన కు నమోదయ్యే ఓట్ల శాతానికి భారీగా గండి పడే అవకాశం ఉంది. అయితే జనసేన గుర్తు విషయంలో ఆ మద్య ఏపీలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. మరి ఊహించని విధంగా ఎదురైన ఈ గండన్ని జనసేన ఎలా అధిగమిస్తుందో చూడాలి. అలాగే జనసేన పార్టీని నమ్ముకున్న బీజేపీకి ఏ స్థాయిలో డ్యామేజ్ జరుగుతుదో మరి.

Also Read:బీజేపీకి బండి సంజయ్ గండం?

- Advertisement -