బీజేపీకి బండి సంజయ్ గండం?

50
- Advertisement -

తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నాళ్లుగా ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోంది. మరో 20 రోజుల్లో ఎన్నికలు జరగాల్సివుండగా అయినప్పటికి పార్టీలో పరిస్థితులు ఏ మాత్రం కుదుట పడినట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా కర్నాటక ఎన్నికల తరువాత ఆ పార్టీ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయిందనే చెప్పాలి. ఆ తరువాత బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం.. ఆ పదవిని కిషన్ రెడ్డికి కట్టబెట్టడం వంటి పరిణామాలతో కమలం పార్టీకి మరింత డ్యామేజ్ జరిగింది. ప్రస్తుతం పార్టీలోని బండి సంజయ్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, రఘునందన్ వంటి వారంతా ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అభ్యర్థుల ఎంపికలో కూడా కీలక నేతలు పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదని, ఇష్టానుసారంగా జరిగినట్లు ఆ పార్టీవర్గాల్లోనే టాక్ వినిపిస్తోంది. దీంతో గెలుపు విషయంలో ఆ పార్టీ నేతలకే నమ్మకం కొరవడినట్లు కనిపిస్తోంది. ఈ కుమ్ములాటలతోనే ఆ పార్టీ సతమతమౌతుంటే ఇటీవల బండి సంజయ్ సి‌ఎం అభ్యర్థి విషయంలో చేసిన వ్యాఖ్యలు మరింత చిచ్చు పెడుతున్నాయి. తాను సి‌ఎం రేస్ లో లేను అన్నట్లుగా ఇటీవల బండి సంజయ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన అనుచరుల నుంచి పార్టీలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

బీసీ నేతను సి‌ఎం అభ్యర్థిగా ప్రకటించబోతున్నట్లు పార్టీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. ఈటెల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి.. సి‌ఎం అభ్యర్థి రేస్ లో ఉంటారని భావిస్తున్నారంతా. కానీ బండి సంజయ్ ఆ రేస్ లో లేడనే టాక్ రావడంతో పార్టీలో చీలిక ఏర్పడే అవకాశం ఉన్నట్లు కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ మద్య అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తరువాత కూడా బండి సంజయ్ పదవి విషయంలో చేసిన వ్యాఖ్యలు బాగానే కాంట్రవర్సీ అయ్యాయి. ఇప్పుడు సి‌ఎం అభ్యర్థి విషయంలో కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరు పార్టీని మరింత దెబ్బ తీస్తున్నాయి. మొత్తానికి బీజేపీకి బండి సంజయ్ గండం పొంచి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరి అధిష్టానం ఈ గండం నుంచి పార్టీని ఎలా బయటపడుతుందో చూడాలి.

Also Read:‘సమంత’ హాట్ ఫొటో పై రచ్చ

- Advertisement -