ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ సంతృప్తి..

272
OP Rawat
- Advertisement -

మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర ఎన్నికల సంఘం…ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. మూడో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ కమర్షియల్ టాక్స్, ఎక్సైజ్, ఇన్కమ్ టాక్స్, ట్రాన్స్ పోర్ట్, రైల్వే, ఎయిర్ పోర్ట్, లీడ్ బ్యాంకర్స్ చెందిన ఎన్నికల నోడల్ ఆఫీసర్స్ తో తాజ్ కృష్ణా హోటల్ లో సమావేశం కానున్నారు అధికారులు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.00 గంట వరకు సీఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరనున్నారు.

రెండోరోజు పర్యటనలో భాగంగా 31 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర పోలీస్ అధికారులతో ఎన్నికల బృందం ప్రతినిధులు వరుస భేటీలు నిర్వహించారు. జిల్లాల వారీగా చేసిన ఏర్పాట్లపై ఎన్నికల సంఘం అధికారులు సంతృప్తిని వ్యక్తం చేస్తూ రాష్ట్ర అధికారులను అభినందించారు.

స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా, పక్షపాతం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణలో నిబద్ధత, నిజాయితీని నిరూపించుకోవాలని కలక్టర్లకు సూచించారు.మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో గట్టి నిఘా కోసం తాత్కాలిక సెల్‌ఫోన్ టవర్లు, మారుమూల ప్రాంతాలకు రహదారుల వ్యవస్థను పటిష్ఠం చేయాలన్నారు. వికలాంగులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

- Advertisement -