ఎన్టీఆర్ బయోపిక్ లో ఆమని..!

464
amani lakshmi parvathi
- Advertisement -

నందమూరి బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్‌లో శరవేగంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. జనవరి 9న ఎన్టీఆర్ సినిమా నేపథ్యంలో కథానాయకుడు,జనవరి 24న రాజకీయ నేపథ్యంలో మహానాయకుడు ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇప్పటివరకు ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్న పాత్రలను రివీల్ చేస్తూ అందరిని ఆకర్షించింది చిత్రయూనిట్. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. లక్ష్మి పార్వతి పాత్ర కోసం సీనియర్ నటి ఆమనిని ఎంపికచేశారని వార్తలు వెలువడుతున్నాయి.

ఎన్టీఆర్ లక్ష్మి పార్వతికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో చూపించబోతున్నారని టాక్. ఇప్పటికే ఈ సినిమాలో విద్యాబాలన్,రానా,కళ్యాణ్ రామ్,కైకాల,రకుల్,జయప్రద కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -