జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈవీఎంలు లేదా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలా అన్న దానిపై అన్ని రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయం సేకరించింది రాష్ట్ర ఎన్నికల సంఘం.11గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ లు ఉండగా అందులో 8 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ అభిప్రాయం తెలిపాయి..
ఒక్క పార్టీ మాత్రమే ఈవిఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరిందని ఈసీ వెల్లడించింది. 5 గుర్తింపు పొందిన పార్టీ లు బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని కోరాయి.2 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఎలాంటి అభిప్రాయం తెలపలేదు..పార్టీ గుర్తు లేని 39 రాజకీయ పార్టీలు ఉండగా..18 పార్టీ లు అభిప్రాయం చెప్పాయి..2 రాజకీయ పార్టీలు ఈవీఎం ద్వారా ఎన్నికలు జరపాలని కోరగా..11పార్టీ లు బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరపాలని కోరాయి..5 రాజకీయ పార్టీలు ఎలాంటి అభిప్రాయం చెప్పలేదని తెలిపింది.
మొత్తం 50 పార్టీ లు ఉండగా…అందులో 26రాజకీయ పార్టీలు తమ అభిప్రాయం చెప్పగా..13పార్టీలు బ్యాలెట్ ,3పార్టీ లు ఈవిఎం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరాయి..వీవీ ప్యాట్ ల తయారి కోసం ఈసిఐ ఢిల్లీ కి లేఖ రాసాం…రిప్లై కోసం ఎదురు చూస్తున్నాం.వీవీ ఫ్యాట్ లు దొరికని పక్షంలో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తాం అని తెలిపింది ఈసీ.