తెలంగాణలో ముగిసిన ఎలక్షన్‌ కోడ్‌ ..

254
Election Code
- Advertisement -

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వడంతో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో రాష్ట్రంలో సుదీర్ఘంగా కొనసాగిన కోడ్‌ నిబంధనకు తెరపడింది. శాసనసభకు ముందస్తు ఎన్నికల నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రారంభమైంది. అయితే నిజానికి రాష్ట్రంలో నవంబర్ నెల నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నది. గత డిసెంబర్ ఏడో తేదీన శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొద్దిరోజులు మాత్రమే ఎన్నికల కోడ్ అమలులో లేదు.

ఆ తర్వాత జనవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు, ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికలు, మేలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, తాజాగా జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు వరుసగా జరుగడంతో ఎన్నికల కోడ్ చాలాకాలం పాటు అమలులో ఉన్నది. ఆరునెలలుగా ఏదో ఒకతీరులో కోడ్ అమలులో ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధాన ప్రకటనలు చేయడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి వీలుకాలేదు. శనివారం జిల్లా పరిషత్ చైర్మన్ల ఫలితాలు వెలువడటంతో స్థానికసంస్థల ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమైంది. దీంతో ఎన్నికల కోడ్ ముగిసినట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -