తుది దశలో ‘ఏక్త’..

257
Ekta Telugu Movie
- Advertisement -

భిక్షమయ్య సంఘం, సుమన్‌రెడ్డి సంయుక్తంగా తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ‘ఏక్త’. నవనీత్‌ కౌర్‌ థిల్లాన్‌, రాబిన్‌ సోహి జంటగా నటిస్తున్నారు. ఈ.వి.వి సత్యనారాయణ, బి.జయ, రమేష్‌, శ్రీనివాసరెడ్డి, సాయి కిషోర్‌ వంటి దర్శకుల దగ్గర మాటల రచయితగా, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన సుమన్‌ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విరాట్‌ సినిమాస్‌ సమర్పణలో బి.ఎస్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ తుదిదశలో ఉంది.

Ekta Telugu Movie

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ”హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ఇది. కేరళ, అలెప్పీలో కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. ఈ నెలాఖరులో గోవాలో తెరకెక్కించే పాటతో సినిమా మొత్తం పూర్తవుతుంది. ఏప్రిల్‌కి మొదటి కాపీ రెడీ అవుతుంది. మే లేదా జూన్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నసీర్‌ఖాన్‌, మిస్‌ ఇండియా 2013 నవనీత్‌ కౌర్‌ థిల్లాన్‌, బాహుబలి ప్రభాకర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. దబు మల్లిక్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ గాయకుడు ఆర్మన్‌ మల్లిక్‌ ఓ ప్రత్యేక గీతం ఆలపించడం విశేషం” అని తెలిపారు.

నసీర్‌ఖాన్‌, సలీల్‌ ఆంకోలా, ప్రణతిరాయ్‌ ప్రకాష్‌, బాహుబలి ప్రభాకర్‌, రుషద్‌ రానా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: తమశ్యామ్‌ సంగీతం: దబు మల్లిక్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సుమన్‌రెడ్డి.

- Advertisement -