సీఎం పదవికి షిండే రాజీనామా

2
- Advertisement -

మహారాష్ట్ర సీఎం పదవికి రాజీనామా చేశారు ఏక్‌నాథ్‌ షిండే. రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌కు రాజీనామా లేఖ సమర్పించారు ఏక్‌నాథ్ షిండే. అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తన రాజీనామా లేఖను అందించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 288 స్థానాలకు గాను 235 సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. బీజేపీ 149 సీట్లల్లో పోటీ చేసి132 చోట్ల విజయం సాధించగా షిండే వర్గం శివసేన 81 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టగా 57 మంది గెలుపొందారు. అజిత్ వర్గానికి చెందిన ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేయగా 41 సీట్లు గెలుచుకుంది.

Also Read:పొంగులేటి ఆస్తులపై దాడుల అప్‌డేట్ ఏది?

- Advertisement -